Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఐరాస మాజీ సెక్రటరీ కోఫీ అన్నన్ కన్నుమూత

Former UN Secretary Kofi Annan Passed Away

జనీవా: ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కోఫీ అన్నన్ శనివారం కన్నుమూశారు. ఆఫ్రికా ఖండం నుంచి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. 1997 జనవరి 1 నుంచి 2006 డిసెంబర్ వరకు పదేళ్ల పాటు ఆయన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఘనాలోని కుమాసిలో పుట్టిన అన్నన్ అమెరికాలో ఉన్నత చదువులు చదువుకున్నారు. 1961లో డిగ్రీ, 1972లో మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1962లో బడ్జెట్ అధికారిగా ఆయన ఐరాసలో పని చేశారు. 1987-92 మధ్య సహాయ కార్యదర్శిగా పని చేశారు. 1997లో తొలిసారి ఆయన ఐరాస ప్రధాన కార్యదర్శిగా బౌత్రోస్ ఘలీ నుంచి బాధ్యతలు స్వీకరించారు.  శనివారం ఉదయం అస్వస్థతకు గురైన అన్నన్‌ను ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అన్నన్ మృతిపై ప్రపంచ దేశాల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

Former UN Secretary Kofi Annan Passed Away

Comments

comments