Home అంతర్జాతీయ వార్తలు విమానంలో తప్పతాగి చిందులేసిన నీలి నటి

విమానంలో తప్పతాగి చిందులేసిన నీలి నటి

aeroplane1హైదరాబాద్: నీలి చిత్రాలలో నటించే హాలీవుడ్ నటి మద్యం తాగి విమానంలో రచ్చ రచ్చ చేసింది. హాలీవుడ్ నటి హర్లీ మేక్‌బ్రైడ్ 1975 నుంచి 1985 వరకు హాలీవుడ్ తన అంద చందాలతో ఒక ఊపు ఊపింది. గాలిలో ఎగురుతున్న విమానంలో ఈమె రచ్చ రచ్చ చేయడంతో అత్యవసరంగా విమానాన్ని కిందికి  దింపారు. న్యూయార్క్ నుంచి ఫ్రాన్స్ వెళ్తోన్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 67 ఏళ్ల మేక్ బ్రైడ్ మద్యం తాగి విమానం ఎక్కింది. తాను మద్యం కావాలని విమానం సిబ్బందితో గొడవకు దిగింది. దీంతో విసిగిపోయిన విమాన సిబ్బంది ఆమెను కుర్చీకి ప్లాస్టిక్ వైర్లతో కట్టేశారు. అత్యవసరంగా విమానాన్ని కిందికి దించారు. విమానంలో గొడవ చేసినందుకు ఆమెకు కోర్టు 19,700 పౌండ్లను జరిమానా విధించింది.