Home ఖమ్మం వివాహేతర సంబంధం : ఒకరి ఆత్మహత్య

వివాహేతర సంబంధం : ఒకరి ఆత్మహత్య

suicide-cartoonఖమ్మం : వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ఆత్మహత్యకు దారితాసింది. ఈ ఘటన ఆదివారం జిల్లా పరిధిలోని బోనకల్లు మండలం సీతానగరంలో జరిగింది. ఎపిలోని కృష్ణా జిల్లా వీరులపాడు మండలం గూడెంమాధవరం గ్రామానికి చెందిన కంచర్ల వేణు(25) కొంతకాలం క్రితం అదే జిల్లా వత్సవాయిలో రైస్‌మిల్లు లీజుకు తీసుకొని నడిపిస్తున్నాడు. అక్కడే వీఆర్వోగా పని చేస్తున్న  వికలాంగురాలైన మహిళతో ఆర్థిక పరమైన సంబంధాలు నెరిపాడు. కొంతకాలం తరువాత ఈ అనుబంధం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. అక్కడ ఒక ఇల్లు తీసుకొని ఆమెతో ఉంటున్నాడు. అక్కడ ఉంటూనే బోనకల్లు మండలం సీతానగరంలో కూడా ఓ రైస్‌మిల్లు అద్దెకు తీసుకుని నడిపిస్తున్నాడు. ఇక్కడ కూడా మరో వివాహితతో సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సీతానగరంలో ఉన్న సదరు మహిళ పనిమీద వేరే గ్రామానికి వెళ్లింది. వత్సవాయిలో ఉన్న మహిళ తాను ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని అడగటంలో , ఇస్తానని అంగీకరించాడు. ఆదివారం ఆమెను సీతానగరంకు తీసుకొచ్చాడు. డబ్బుల విషయమై వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో వేణు మహిళను ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో ఆమె స్పృహ తప్పిపడిపోయింది. ఈ క్రమంలో మహిళ చనిపోయిందన్న భయంతో తాను కూడా ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయాడు. కొంత సమయం తరువాత ఆమె లేచిచూడగా వేణు ఉరికి వేలాడుతున్నాడు. పరిసర ప్రాంతాల వారికి సమాచారం అందించారు వారు వేణు మృతదేహాన్ని కిందకు దింపారు. పోస్టుమార్టం కోసం వేణు మృతదేహాన్ని మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్య చికిత్స కోసం ఆమెను మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వేణుకు పెళ్లైంది. అతని భార్య స్వగ్రామంలో ఉంటోంది. పోలీసులు కేసు విచారిస్తున్నారు.