Home తాజా వార్తలు బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

Car-Accidentహైదరాబాద్: బంజారాహిల్స్‌లో అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో అతివేగంగా ప్రయాణిస్తున్న ఫార్చూన్ కారు అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. అతివేగంగా వస్తూ మూలమలుపు వద్ద కారును నియంత్రించలేకపోవడంతో చెట్టును ఢీకొట్టి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న హెయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అయితే కారుపై సినీనటుడు నందమూరి బాలకృష్ణ పేరుతో స్టిక్కర్ ఉంది. కాగా కారును ఎవరు నడిపారు? అందులో ఎవరు ఉన్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.