Search
Friday 21 September 2018
  • :
  • :

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో నలుగురు అరెస్టు

Four arrested in Drunk and Drive

జయశంకర్ భూపాలపల్లి: మండలంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన ఘటన  మంగపేట చోటుచేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని కోమటిపల్లి క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న బుచ్చంపేట గ్రామానికి చెందిన పగిడిపల్లి రవి, కొత్తపేటకు చెందిన రేబల్లె నర్సింహారావు, కేమటిపల్లికి చెందిన ఊడుగుల నర్సయ్య, మంగపేట మండల కేంద్రానికి చెందిన రేటె నాగేశ్వరరావులను గుర్తించి అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మద్యం సేవించి వాహనాలను నడిపితే జరిమానాలతో పాటుగా కఠిన చర్యలు తీసుకుంటామని చేప్పారు  సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి జైలుకు తరలించామని తెలిపారు.

Comments

comments