Home ఆదిలాబాద్ కారును ఢీకొట్టిన లారీ: నలుగురు బ్యాంక్ మేనేజర్లకు గాయాలు

కారును ఢీకొట్టిన లారీ: నలుగురు బ్యాంక్ మేనేజర్లకు గాయాలు

 

 

గుడిహత్నూర్: కారును లారీ ఢీకొట్టిన ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో జరిగింది. కారును వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో నలుగురు బ్యాంక్ ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎస్‌బిఐ బ్యాంకులో పని చేస్తున్న నలుగురు బ్యాంక్ మేనేజర్ల విధుల కోసం నిర్మల్ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తుండగా ఈప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని ఖానాపూర్ ఎస్‌బిఐ మేనేజర్ ప్రసాద్, తిమ్మాపూర్ ఎస్‌బిఐ మేనేజర్ బాలా రెడ్డి, లింగాపూర్ ఎస్‌బిఐ మేనేజర్ ప్రసాద్, పెంబీ మేనేజర్ రణధీర్‌లుగా గుర్తించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

 

Four Bank Managers Injured in Lorry Collided to Car