Home నిజామాబాద్ తృటిలో తప్పిన పెనుప్రమాదం..

తృటిలో తప్పిన పెనుప్రమాదం..

Four cars Damage Fall On Tree In Nizamabad
నిజామాబాద్ ః నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం పక్కనే ఆఫీసర్స్ క్లబ్ ముందు ఉన్నవందేళ్ల వేపచెట్టు పడిపోవడంతో నాలుగుకార్లు, ఒక ద్విచక్రవాహనం ద్వంసమైన ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. రోజులాగే ఆఫీసర్స్ క్లబ్‌కు ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థల వ్యక్తులు షటీల్ ఆడేందుకు వస్తారు. రోజులాగే శనివారం ఉదయం సిరికొండ తహసీల్దార్ వీర్‌సింగ్, ఉపాధ్యాయుడు రచ్చ మురళీ మాట్లాడుకుంటూ వేపచెట్టు వద్ద నిలుచున్నారు. ఒక్కసారిగా వేపచెట్టు రెండుగా చీలిపడటంతో తృటిలో ప్రాణాలు దక్కాయని, స్వల్పగాయాలయ్యాయని తెలిపారు. పార్కింగ్ చేసిన జిల్లా ఆడిట్ ఆఫీసర్ రాము కారు టిఎస్03 ఈఎస్5426, ఎటిఎస్ శ్రీనివాస్ కారు ఎపి 25 ఏక్యూ 3456, డాక్టర్ మోతిలాల్ కారు టిఎస్ 16 ఈఏ 1111, అరుణచలం కారు ఎపి25జెఎం 4000 ద్విచక్రవాహనదారుడు సిద్దు ఎపి09 ఏ 3996 వామహనాలపై చెట్లు పడి ద్వంసమయ్యాయి. ఘటన జరిగిన ప్రాంతంలో రోజువారిగా చెత్తను సేకరించి ఆ చెట్టు పక్కనే చెత్తకు నిప్పటించడంతో తల్లివేళ్లు కాలిపోయి  ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం మొత్తంలో కరెంట్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఇంటర్నేట్ సౌకర్యం నిలిచిపోయింది. ఒక పక్క కలెక్టర్ క్యాంపు కార్యాలయం, మరోపక్క సిసి క్యాంపు కార్యాలయం ఉండటంతో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తమై ఎక్కడికక్కడే తీసివేసి అన్ని సౌకర్యాలు కలిగేలా చర్యలు చేపట్టారు.