Home జాతీయ వార్తలు లక్నోలో భారీ అగ్నిప్రమాదం…

లక్నోలో భారీ అగ్నిప్రమాదం…

Four Dead Massive Fire Breaks Out at Hotel Viraat in Lucknow's Charbagh

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో రైల్వే స్టేషన్‌ సమీపంలోని చార్ భాగ్ దూద్ మండి ప్రాంతంలోని విరాట్ ఇంటర్నేషనల్ హోటల్‌లో మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి హోటల్‌లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసింది. అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం నుంచి 50 మందికి పైగా సురక్షితంగా రక్షించింది. అయితే, ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా, యుపి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున పరిహారం ఇవ్వనుంది.