Home తాజా వార్తలు అంత్యక్రియలకు వెళ్తూ అనంతలోకాలకు..!

అంత్యక్రియలకు వెళ్తూ అనంతలోకాలకు..!

Four died after Tata Ace Collision with Lorry at Siddipet Dist

సిద్దిపేట: బంధువుల అంత్యక్రియలకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం సంభవించడంతో నలుగురు మృతి చెందిన విషాద సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మలగూడ రాజీవ్ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. లారీ-టాటా ఏస్ ఒకదానొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ లో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులను వర్గల్ మండలం పాములపర్తికి వాసులుగా గుర్తించారు. చేర్యాలలో అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Four died after Tata Ace Collision with Lorry at Siddipet District.