టొరంటో: కెనడాలో కాల్పుల కలకలం రేగింది. ఫెడరిక్టన్ సిటీలో దుండగులు జరిగిన కాల్పుల్లో 4గురు మృతిచెందారు. భద్రత రీత్యా ప్రజల ఎవరూ తమ ఇంట్లో నుంచి బయటకు రావొద్దని అని పోలీసులు హెచ్చరించారు. భారీగా గన్ శబ్ధాలు వినిపిస్తున్నట్టు స్థానిక రిపోర్టర్ల నుంచి సమచారం అందింది. బ్రూక్సైడ్ డ్రైవ్ ప్రాంతంలో ఈ కాల్పులు ఘటన చోటుచేసుకుంది. రెండు వారాల కిందట టొరంటో ఓ వ్యక్తి కాల్పులు జరిపి ఇద్దర్ని చంపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.