Home తాజా వార్తలు గూడ్స్ రైలు ఢీకొని 4 ఏనుగులు మృతి

గూడ్స్ రైలు ఢీకొని 4 ఏనుగులు మృతి

Elephant

భువనేశ్వర్: ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లా తిలిదిహి గ్రామంలో సోమవారం ఉదయం గూడ్స్ రైలు ఢీకొని నాలుగు ఏనుగులు దుర్మరణం చెందాయి. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పట్టాలపై ఉన్న ఏనుగుల కళేబరాలను క్రేన్ల సహాయంతో తొలగించారు. అటవీ శాఖ అధికారులు ఏనుగుల కళేబారాలను స్వాధీనం చేసుకున్నారు. రైలు  ప్రమాదాల నుంచి ఏనుగులను రక్షించడానికి రైల్వే శాఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోందని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.