Home అంతర్జాతీయ వార్తలు నలుగురు ఇస్లామిక్ ఉగ్ర‌వాదులు హ‌తం

నలుగురు ఇస్లామిక్ ఉగ్ర‌వాదులు హ‌తం

Encounterకొలంబో : శ్రీలంక‌లో శనివారం భద్రతా బలగాలకు  ఇస్లామిక్ ఉగ్ర‌వాదుల‌కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారు. క‌మ్మునాయి ప‌ట్ట‌ణంలో ఓ ఇంట్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతాబలగాలకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంట్లోకి ప్ర‌వేశించేందుకు భ‌ద్ర‌తా ద‌ళాలు ప్ర‌య‌త్నించాయి. ఈ క్రమంలో ఇస్లామిక్ ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు దిగారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో  న‌లుగురు ఉగ్ర‌వాదులు హతమైనట్టు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఓ సాధార‌ణ పౌరుడు కూడా మృతిచెందాడు. అనుమానిత సూసైడ్ బాంబ‌ర్ల‌ను హతమార్చినట్టు అధికారులు చెప్పారు. మ‌రో ముగ్గురు ఉగ్రవాదులు గాయాల‌తో పరారయ్యారని వారు వెల్లడించారు. ఉగ్రవాదులు దాక్కున్న ఇంటి నుంచి ఐఎస్ జెండాతో పాటు యూనిఫామ్‌ల‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. గత ఆదివారం శ్రీలంక‌లో ఈస్ట‌ర్ వేడుక‌ల స‌మ‌యంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు బాంబు పేలుళ్లు జరిపిన విషయం తెలిసిందే. ఈ  పేలుళ్ల‌లో సుమారు 300 మంది చనిపోయారు. బాంబు పేలుళ్లు ఘటనతో శ్రీలంక‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం శ్రీలంక‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Four Islamic Terrorists Encounter in Sri Lanka