Home తాజా వార్తలు క్రైమ్ రేటు ఘననీయంగా తగ్గింది: కెటిఆర్

క్రైమ్ రేటు ఘననీయంగా తగ్గింది: కెటిఆర్

KTR

హైదరాబాద్: భాగ్యనగరంలో పోలీసులు సమర్థవంతంగా పనిచేయడం వల్ల క్రైమ్ రేటు ఘననీయంగా తగ్గిందని మంత్రి కెటిఆర్ కొనియాడారు. జిహెచ్‌ఎంసి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను శనివారం కెటిఆర్ ప్రారంభించారు.  120 మందికి 40 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, విపత్తులను ఎదుర్కొనేందుకు ఈ టీమ్ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు అద్భుతంగా పని చేస్తున్నారని కేంద్ర ప్రశంసించిందని గుర్తు చేశారు. ప్రజల రక్షణ కోసం ఇప్పటివరకు నాలుగు లక్షల సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఎనిమిది వేలకు పైగా ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించామన్నారు. ప్రకృతి విపత్తులు, నాలాల కబ్జాలు, ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.