Home జాతీయ వార్తలు నలుగురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్

నలుగురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్

Maoistsఛత్తీస్‌గఢ్ :  సుక్మా జిల్లా బీమాపురం అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసులు – మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో  నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.  కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి  ఇన్సాస్ రైఫిల్, రెండు 303 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Four Maoists Encounter at Chhattisgarh on Tuesday