Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

నలుగురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్

Four Maoists Encounter in Chhattisgarh

ఛత్తీస్‌గఢ్ : బీజాపూర్ జిల్లా గుమిత్‌బీడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మహిళా మావోయిస్టుతో పాటు ముగ్గురు కమాండర్లు ఉన్నారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Four Maoists Encounter in Chhattisgarh

Comments

comments