Home జగిత్యాల బస్సును ఢీకొట్టిన లారీ: నలుగురి పరిస్థితి విషమం

బస్సును ఢీకొట్టిన లారీ: నలుగురి పరిస్థితి విషమం

Four, Policemen, Were, Injured, Road Accident,Telangana news,Telugu news,Road Accident news in Telugu,Road Accident news Today in Telugu,Road accident news in Hyderabad,Road Accident News in Outer Ring Road,Road Accident in India in Telugu

మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆరపేట శివారులో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయరహదారిపై ఆర్‌టిసి బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను మెట్‌పల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న లారీ, బస్సును క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.