Search
Monday 24 September 2018
  • :
  • :

అదుపు తప్పి బొలెరో బోల్తా… నలుగురు మృతి

Four members  deaths... Bolero Roll
ఆసిపాబాద్/రెబ్బెన: రెబ్బెన మండలం సోనాపూర్ సమీపంలో శనివారం బొలెరో చాంబర్ వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీ కొన్ని సుమారు 100 ఫీట్ల లోతు కాలువలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రత్యేక్ష సాక్షులు, సింగరేణి అధికారులు , రెబ్బెన పోలీసుల సమాచారం ప్రకారం… ఖైరిగూడ ఓపెన్‌ కాస్టులో డిబిఎల్ కంపెనిలో సబ్‌ కాంట్రాక్టు తీసుకున్న డేకో కంపెనీకి చెందిన బొలెరో (ఎంహెచ్34ఎవి1618) వాహనంలో డ్రైవర్ మహ్మద్ ఇంతియాజ్‌ఖాన్ మరో ముగ్గురిని తీసుకుని గోదావరిఖని నుండి ఖైరిగూడ ఓపెన్‌ కాస్టులో వాహనాల మరమ్మతుల నిమిత్తం వస్తుండగా సోనాపూర్ సమీపంలో బొలెరో క్యాంపర్ వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీ కొంది. దీంతో వాహనం ఒక్కసారిగా లేచి సుమారు 100 ఫీట్ల లోతు కాలువలో పడింది. దీంతో వాహనం పూర్తిగా నుజ్జు నుజ్జు కావడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు, పోలీసులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను అతికష్టం మీద వాహనం నుండి బయటికి తీశారు. స్వయంగా ఖైరిగూడ ప్రాజెక్టు ఆఫీసర్ మోహన్‌రెడ్డి వాహనంలోకి వెళ్లి మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటికి తీయడం విశేషం. అలాగే పలువురు సింగరేణి కార్మికులు, వాహనదారులు మృతదేహాలను కాలువలో నుండి బయటికి తీసుకువచ్చారు. కాగా డ్రైవర్ మహ్మద్ ఇంతియాజ్‌ఖాన్ జార్ఖండ్ రాష్ట్రంలో ధన్‌బాద్‌కు చెందిన వాడు కాగా మరో ఇద్దరు గోదావరి ఎన్‌టిపిసికి చెందిన వారు. మరొకరు మంచిర్యాలకు చెందిన మెకానిక్ దుర్గారావుగా గుర్తించారు. అనంతరం మృతదేహాలకు శవ పరీక్ష నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి రెబ్బెన సీఐ పురుషోత్తం చారి ఆధ్వర్యంలో ఎస్సై శివ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments