Home తాజా వార్తలు అదుపుతప్పి బోల్తాపడిన ఆర్మీ వాహనం

అదుపుతప్పి బోల్తాపడిన ఆర్మీ వాహనం

Road-Accident-in-Jammu-Kash

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లోని కుల్గమ్ జిల్లా కాజీగండ్ ప్రాంతలోని బొనగామ్ శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్మీకి చెందిన వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆర్మీ వైద్యశాలకు తరలించారు. పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో రోడ్డుపై ఉన్న వాహనాన్ని పక్కకు తొలగించారు.