Home తాజా వార్తలు ప్రమాణ స్వీకారం చేసిన ఆ నలుగురు మంత్రులు

ప్రమాణ స్వీకారం చేసిన ఆ నలుగురు మంత్రులు

           Ministers

ఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం ఉదయం  మంత్రులతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ మంత్రులుగా ధర్మేంద ప్రధాన్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రమాణ స్వీకారం చేశారు. పీయూష్ గోయల్‌కు రైల్వే శాఖ కేటాయించనున్నట్లు సమాచారం. సహాయ మంత్రులుగా పనిచేసిన ఈ నలుగురికి ప్రధాని నరేంద్ర మోడీ పదోన్నతి కల్పించారు.

 పార్ల‌మెంట్ వ్య‌వ‌హారాల శాఖ సహాయ మంత్రిగా ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ, స్వ‌తంత్ర హోదాలో వాణిజ్య శాఖ మంత్రి గా నిర్మలా సీతారామ‌న్ , విద్యుత్, బొగ్గు గనుల శాఖకు సహాయ మంత్రిగా పియూష్ గోయల్‌,  చమురు శాఖ సహాయ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్‌ లకు పని చేసిన అనుభవం ఉంది.