Home తాజా వార్తలు అమెజాన్‌ను మోసం చేసిన కేసులో నలుగురు అరెస్ట్

అమెజాన్‌ను మోసం చేసిన కేసులో నలుగురు అరెస్ట్

amezon

హైదరాబాద్: ఆన్ లైన్ లో ఫోన్లు ఆర్డర్ చేసి తమకు రాలేదంటూ… అమెజాన్ సంస్థను మోసం చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ డిసిపి జానకీ షర్మిలా తెలిపిన కథనం ప్రకారం… ఆన్ లైన్లో ఆర్డర్ చేసిన ఫోన్లు తమకు రాలేదని మళ్లీ ఫోన్లను పంపించాలని అమెజాన్ సంస్థకు ఆర్డర్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన ఆ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 10.75 లక్షలు నగదు, 556 సిమ్ కార్డులు, 42 మెబైల్ పోన్ల, 2 ల్యాప్ టాప్ లను స్వాధీన పరుచుకున్నారు.