Search
Friday 21 September 2018
  • :
  • :

రక్తమోడిన రహదారి… కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం

Four People Dies In Road Accident In Kodad

కోదాడక్రైమ్‌ః శుభకార్యానికి వెళ్ళి వస్తూ ఆనంతలోకాలకు వెళ్ళిన సంఘటన కోదాడ పట్టణ శివారులోని ఎస్‌ఆర్‌ఎం పాఠశాల సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది.  మినీ ఆశోక్‌ లేల్యాండ్ వాహనం టైర్ పగిలి పల్టీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడికే మృతి చెందారు. కోదాడ పట్టణ సిఐ శ్రీనివాసు రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం గట్టుభీమవరం గ్రామానికి చెందిన వారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నెమ్మికల్ దండు మైసమ్మ దేవాలయంలో శుభకార్యం నిమిత్తం వెళ్ళి వస్తుండగా కోదాడ పట్టణ శివారులోని ఎస్‌ఆర్‌ఎం పాఠశాల సమీపానికి రాగానే ఆశోక్‌ లేల్యాండ్ వాహనం యొక్క వెనుక టైర్ పగిలిపోవడంతో ఒకేసారి రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడికే ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు సిఐ తెలిపారు.మృతులు ఆళ్ళ గురుస్వామి (25), పల్లెబోయిన వీరయ్య (45), షేక్ హుస్సేన్ (45) వీరితో పాటు పరిటాల కొండా (45) అనే వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలిస్తుండగా మార్గమద్యలోని మృతి చెందినట్లు సిఐ తెలిపారు. ఈ ప్రమాదంలో సంపశాల కోటేశ్వరరావు, గలం వెంకటేశ్వర్లు, సంపశాల బుచ్చయ్య, శీలం త్రివేణికు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించినట్లు తెలిపారు. ఈ సంఘటనతో గట్టు భీమవరం గ్రామంలో విషాధ చాయాలు చోటు చేసుకున్నాయి. బంధువులు శోకసముద్రంలో ఉన్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

comments