Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

కారు లారీ ఢీ : నలుగురికి గాయాలు

Four People Injured in Road Accident in Medak

మాయంపేట :కారుని లారీ ఢీకొట్టిన  ఘటనలో నలుగురికి గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషయమంగా ఉంది . ఈ ఘటన రామాయంపేట పట్టణంలో శివారులోని బైపాస్‌ రోడ్‌లో అడిగాస్ హోటల్ వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన మణికుమార్,చందు,నాగేంద్రతో మరోకరు ఉన్నారు.కాగా వీరు ప్రయాణిస్తున్న కారును అడిగాస్ హోటల్ వద్ద నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్ కు వెళుతున్న లారీ అతి వేగంగా ఢీకొంది.దీంతో కారులో ఉన్న నలుగురికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మణికుమార్ పరిస్థితి విషయంగా ఉండటంలో మెరుగైన వైద్యం కోసం నగరానికి రెఫర్ చేశారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments