Home తాజా వార్తలు బొలెరో బోల్తా

బొలెరో బోల్తా

accident

వంతెన పైనుంచి లోయలో పడి నలుగురు దుర్మరణం
కొమురంభీం జిల్లా సోనాపూర్ వద్ద ప్రమాదం

మంచిర్యాల/ రెబ్బెన: జిల్లా రెబ్బెన మండలంలోని సోనాపూర్ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గోదావరిఖని నుండి కైరీగూడ ఓపెన్‌కాస్టు కు బొలెరో (ఎంహెచ్ 34ఎవి1618) వాహనం లో వెళ్తుండగా సోనాపూర్ వద్ద అదుపు తప్పి కల్వ ర్టు ఢీకొని లోయలో పడిపోయింది. ఈ సంఘటన లో వాహనం నుజ్జు నుజ్జు కాగా డిబిఎల్ కంపెనీకి చెందిన నలుగురు వ్యక్తులు బళ్లా కోటేశ్వర్‌రావు (48), చరణ్‌కుమార్ (47), దుర్గరావు (52), డ్రైవర్ మహ్మద్ ఇంతియాజ్ (45) అక్కడికక్కడే మృతి చెందారు. వీరందరు గోదావరిఖనిలోని ఎన్‌టిపిసికి చెందిన కైరిగూడ ఓపెన్‌కాస్టులోని  డిబిఎల్ సబ్‌డెకో కంపెనీలో కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగం గా శనివారం కైరిగూడ ఓపెన్‌కాస్టు నుండి వాహనాల మెయింటనెన్స్ కోసం గోదావరిఖనికి వెళ్లి  తిరిగి వస్తుండగా మూల మలుపు వద్ద వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీకొని లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న సింగరేణి అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి క్రేన్‌ల సహాయంతో లోయలో పడ్డ వాహనంతో పాటు మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదం చోటు చేసుకున్న స్థలాన్ని రెబ్బెన సిఐ పురుషోత్తమాచా రి, ఎస్‌ఐ శివకుమార్‌లు సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం  బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.