Home తాజా వార్తలు మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి

మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి

Drown-Swimming

భద్రాద్రి కొత్తగూడెం: మహాశిరాత్రి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పినపాక మండలం చిలుకల బంగారం వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీళ్లను గొల్లబయ్యారం గ్రామానికి చెందిన నాగేందర్, ప్రేమ్, మురళి, పవన్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గల్లంతైన వారి కోసం గజా ఈతగాళ్లతో జల్లెడ పట్టిస్తున్నారు.