Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ : నలుగురు ఉగ్రవాదులు హతం

Kashmir-Army-Encounter

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులతో సహా ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవ ఆధీన రేఖకు సమీపంలో నౌగామ్ సెక్టార్ లో శనివారం రాత్రి సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు, ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సైనికులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాగా ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సైనికులు మరణించాడు.ఘటనా స్థలంలో నాలుగు ఆయుధాలతోపాటు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సైన్యం తెలిపింది.

Comments

comments