Search
Wednesday 26 September 2018
  • :
  • :

జాతీయ రహదారిపై నాలుగు వోల్వో బస్సులు ఢీ

Volvo-Bus

ఇటిక్యాల: జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలోని పొగాకు కంపెనీ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున 2.00గం..ల సమయంలో హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న వోల్వో బస్సు ముందుగా వెళ్తున్న లారీని తప్పించబోయి లారీని ఢీకొట్టింది. అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో బస్సు వెనుక నుండి వస్తున్న మరో వోల్వో బస్సు ముందున్న బస్సును ఢీకొట్టింది. ఈ విధంగా ఒకదాని వెనుక మరొకటి మొత్తం నాలుగు వోల్వో బస్సులు ఢీకొన్నాయి. బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సహాయంతో గాయపడ్డవారిని కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్లు పరిమితికి మించిన వేగంతో పోటాపోటీగా అత్యంత వేగంతో నడపడం వల్లనే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణీకులు తెలిపారు.

Comments

comments