Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ఇంచార్జులతో ఇబ్బందులెన్లో..

Four VROs for 18 Gram Panchayats

మన తెలంగాణ/టేకుమట్ల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండలంలో 18 గ్రామపంచాయతీలకు నలుగురు విఆర్‌ఒలు మాత్రమే ఉండటం విస్మయానికి గురిచేస్తుంది. మిగిలిన గ్రామాలకు ఇంచార్జులు ఉండటం వినడానికి విడ్డూరంగా ఉంది కదూ.. కానీ ఇది నిజం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మండలం నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలో సరిపడు సిబ్బంది లేకపోవడం వలన ప్రజలు అనేక సమస్యలతో వచ్చి సకాలంలో పనులు కాకపోవడం వల్ల ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగి పోతున్నారు ఇంచార్జుల పాలనతో అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. మండలంలో రెవెన్యూశాఖలో ప్రభుత్వం 10 మంది విఆర్‌ఒలను కేటాయించవల్సి ఉండగా.. నలుగురు విఆర్‌ఒలతో పరిపాలన కొనసాగించడం వలన అనేక సమస్యలు ప్రజలు ఎదురొంటున్నా రు. అదే విధంగా 18 గ్రామ పం చాయతీలకు ఐదుగురు పంచా యతీ కార్యదర్శులు కొనసాగుతున్నారు. నూతనంగా ఏర్పాటైన మండలంలో గతంలో పనిచేసి గత డిసెంబర్‌లో బదిలీపై వెళ్లగా గత ఆరు నెలల నుండి ఇంచార్జీలను ఎస్‌ఐలుగా ఉండటం వలన ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. మండల ప్రజల సౌకర్యం కోసం స్పందించిన ఎస్పీ భాస్కరన్ చిట్యాల 2వ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నా సూర్యనారాయణకు ఇంచార్జీ ఎస్‌ఐగా బాధ్యతలు అప్పగించారు. మండలంలో ఉన్న వివిధ శాఖలైన విద్యా, వైద్య తదితర శాఖల్లో ఇంచార్జులతో పరిపాలన కొన సాగుతుంది. దీంతో అభివృద్ధికి ప్రజలు దూరమవుతున్నారని మండలానికి తక్షణమే పూర్తి స్థాయి సిబ్బందిని కేటాయించాలని జిల్లా పరిపాలన అధికారి జిల్లా కలెక్టర్ స్పందించి మండలానికి సరిపడు సిబ్బందిని కేటాయించాలని మండల ప్రజలు కోరుచున్నారు.
ఇంచార్జులతో అనేక పనులు చేశాం : తహసీల్దార్ ఆడెపు సంపత్ కుమార్ నూతన మండలంలో అనేక సమస్యలు ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సమస్యల పట్ల 90శాతం పనులు విజయవంతంగా పూర్తి చేశామని పగలు, రాత్రి కష్టపడి ఉన్న సిబ్బందితో రెవెన్యూ రికార్డుల కార్యక్రమాన్ని పూర్తి చేశామని తహసీల్దారు సంపత్ కుమార్ తెలిపారు. మండలంలో రెవెన్యూ ఇన్స్ పెక్టర్, జూనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహసీల్దార్, టైపిస్టు, మండల విధ్యాశాఖ అధికారిలాంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని దీని వల్ల అధికారులకు అధనపు భారం పడుతుందని పూర్తిస్థాయి అధికారులను కేటాయించి పనిభారం తగ్గుతుందని అన్నారు.
ఉన్న సిబ్బందితో అభివృద్ధి పనులు ఎన్నో చేశాం : ఎంపిడిఒ చందర్
మండలంలో ఉన్న ఐదుగురు పంచాయతీ కార్యదర్శులతో అనేక అభివృద్ధిపనులు గ్రామాలల్లో చేయడం జరుగుతుంది. సిబ్బంది లేక పోయినా శక్తి వంచన లేకుండా పనిచేసి గ్రామాలకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడం జరుగుతుందని ఎంపిడిఒ చందర్ అన్నారు. ఐదుగురు పంచాయతీ కార్యదర్శులకు 5 గ్రామాల ఇంచార్జులుగా ఉన్నారు. ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను కేటాయిస్తే అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.
మండలానికి పూర్తి స్థాయి అధికారులను నియమించాలి : ఏఐఎప్‌బి జిల్లా కార్యదర్శి మారెపెల్లి మల్లేశం :
నూతనంగా ఏర్పడిన టేకుమట్ల మండలానికి పూర్తి స్థాయి అధికారులను నియమించాలని ఆల్‌ఇండియా ఫార్వాడ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి మారెపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. ఇంచార్జుల వల్ల మండల అభివృద్ధి కుంటుబడి పోయే ప్రమాధం ఉందన్నారు. మండలంలో కీలక పోస్టులన్నీ ఇంచార్జులే ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా జిల్లా అధికారులు తక్షణమే స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాలని మల్లేష్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Comments

comments