Search
Sunday 18 November 2018
  • :
  • :

నాలుగేళ్ల పాలనలో టిఆర్‌ఎస్‌తో ఒరిగిందేమీ లేదు: ఉత్తమ్

Four years under the control of TRSమన తెలంగాణ/చింతలమానేపల్లి: నాలుగేళ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వంతో ఒరిగిందేమీ లేదని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ అ న్నారు. మండలంలోని రవీంద్రనగర్‌లో మంగళవారం  బస్సు చైతన్యయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద నిర్మిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సృజల స్రవంతి బ్యారేజి నిర్మాణాన్ని ఆపి డిజైన్‌ను మార్పిడి చేసి కాళేశ్వరం మేడిగడ్డ వద్ద ఈ ప్రాజెక్టును తరలించడంతో సిర్పూర్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని ఆపి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసిందని అన్నారు. ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రారంభించగా తెలంగాణ ప్రభుత్వం డిజైన్ మార్పిడి చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెనుకబడిన ప్రాజెక్టులను పునఃప్రారంబించి సిర్పూర్ నియోజకవర్గాన్ని సశ్యశ్యామలంగా మారుస్తామని అన్నారు. అదే విధంగా సిర్పూర్ పేపర్‌మిల్లును తెలంగాణ ప్రభుత్వం వచ్చాచ మూతపడడంతో 12 వేల కార్మికుల పొట్టన కొట్టారని అన్నారు. అదే విధంగా నిజాం సాగర్ షుగర్ ఫ్యాక్టరి మూతపడడంతో 100 రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పిన మంత్రులు, వెయ్యి రోజులైనా ప్రారంభించకపోవడం సిగ్గుచేటని అన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వంలో మిషన్ భగీరథ పేరు పెట్టి ఇంటింటికి నల్లా అని మాయమాటలు చెప్తు కేసిఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. అదే విధంగా నియోజకవర్గంలో పోడు భూములకు హక్కుపత్రాలు ఉన్నా సమగ్ర సర్వేలో నమోదు చేసుకుని ఎకరాకు రూ.4వేలు ఇస్తానని ఇవ్వకపోవడం పోడు రైతులకు ఎంతో అన్యాయం చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు రూ. 2లక్షల రుణమాఫి, పంటలకు మద్దతు ధర కల్పిస్తామని తెలంగాణలో రైతులకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక రైతులు దిగులు చెందుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరి , మొక్కజొన్న, సజ్జ పంటలకు రూ. 2వేలు మద్దతు ధర కల్పిస్తామని, అదే విధంగా పత్తి పంటకు రూ.6వేలకు మించకుండా మద్దతు ధర కల్పిస్తామని అన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ. 1లక్ష మంజూరు చేస్తామని అన్నారు. అదే విధంగా తెలంగాణలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతికింద నెలకు రూ. 3వేలు అందజేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చిన్నాపెద్ద తేడా లేకుండా అందరికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపి షబ్బీర్‌అలీ, మాజీ మంత్రి హన్మంతరావు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, డీసీసీ మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపి సీతారాం నాయక్, మాజీ హోం మినిస్టర్ సమితా ఇంద్రారెడ్డి, టీపీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి, కాంగ్రెస్ నాయకులు అరవింద్‌రెడ్డి ,శ్రావన్, నరేష్,రవి, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రావి శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్‌యాదవ్, సిడాం గణపతి, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments