Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య యత్నం…

Fourth suicide attempt of the Single  family

ధర్మపురి: కులం పేరుతో దూషిస్తున్నారని మనస్థాపానికి గురైన ఓ కుటుంబం ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా, విషయం తెలుసుకుని పోలీసులు వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకుని, వారిని కాపాడిన సంఘటన ధర్మపురి మండలం రాయపట్నంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన కథనం ప్రకారం…  వెల్గటూర్ మండలం గుల్లకోట గ్రామానికి చెందిన ఆవునూరి తిరుమల ఆదే మండలం పైడిపెల్లి గ్రామంలోని ఆమె తల్లిగారి ఇంటి దగ్గర ఇద్దరు పిల్లలతో కలిసి భర్తకు కొంత కాలం నుండి దూరంగా ఉంటుంది. కుటుంబ కలహాలతో పాటు, పైడిపెల్లికి చెందిన ఓ వ్యక్తి కులం పేరుతో దూషిస్తున్నాడని మనస్థాపానికి గురైన తిరుమల, తల్లి కుసునపల్లి లక్ష్మితో పాటు, ఇద్దరు పిల్లలను తీసుకున్ని మంగళవారం రాత్రి మండలంలోని రాయపట్నం బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. రాత్రిపూట అనుమానస్పదంగా గోదావరి వైపు వెళ్తున్న వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ధర్మపురి బ్లూకోట్ టీం సభ్యులు పిసి రవీందర్, హెచ్‌జి శ్రీనివాస్‌లు ఘటన స్థలానికి చేరుకుని, ఆత్మహత్య యాత్నానికి ప్రయత్నిస్తున్న తిరుమల కుటుంబాన్ని కాపాడారు. వారికి నచ్చజెప్పి ధర్మపురి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ధర్మపురి సిఐ లక్ష్మిబాబు, ఎస్‌ఐ లక్ష్మినారాయణలు తిరుమల కటుంబ సభ్యులకు ఏ విధమైన సమస్యలున్న న్యాయం చేస్తామని ధైర్యం చెప్పారు. తిరుమల కుటుంబాన్ని కాపాడిన బ్లూకోట్ టీం సభ్యులు రవీందర్, శ్రీనివాస్‌లను పలువురు అభినందించారు.

Comments

comments