Home తాజా వార్తలు అర్జెంటీనాకు ఫ్రాన్స్ షాక్

అర్జెంటీనాకు ఫ్రాన్స్ షాక్

World Cup hockey Match

భువనేశ్వర్: ఇక్కడ ప్రపంచకప్ హాకీలో గురువారం సంచలన ఫలితం నమోదైంది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అర్జెంటీనాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఫ్రాన్స్ 53 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. మరోవైపు స్పెయిన్‌తో జరిగిన మరో మ్యాచ్‌ను న్యూజిలాండ్ 22తో డ్రాగా ముగించింది. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. ర్యాంకింగ్స్‌లో తనకంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న ప్రత్యర్థి జట్టును ముప్పుతిప్పలు పెట్టింది. రెండో క్వార్టర్స్‌లో ఏకంగా నాలుగు గోల్స్ చేసి సంచలనం సృష్టించింది. ఇక, అర్జెంటీనా కూడా స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఫ్రాన్స్ కళ్లు చెదిరే అటాకింగ్‌తో అర్జెంటీనాను కోలుకోనివ్వలేదు. ఇరు జట్లు కూడా నువ్వానేనా అన్నట్టు పోరాడినా చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న ఫ్రాన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది.

18వ నిమిషంలో హ్యూగో గెన్‌సెట్ ఫ్రాన్స్‌కు తొలి గోల్ అందించాడు. 23వ నిమిషంలో విక్టర్ చార్లెట్ రెండో గోల్ చేశాడు. ఆ వెంటనే అరిస్‌టైడ్ ఫ్రాన్స్ తరపున మూడో గోల్ నమోదు చేశాడు. కాగా, అర్జెంటీనా తరపున లుకాస్ మార్టినెజ్ 28వ నిమిషంలో తొలి గోల్ చేశాడు. ఇదిలావుండగా 30వ నిమిషంలో గాస్‌పార్డ్ ఫ్రాన్స్‌కు నాలుగో గోల్ అందించాడు. ప్రథమార్ధంలో ఫ్రాన్స్ 41 ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌ను న్యూజిలాండ్ 22తో డ్రాగా ముగించింది. ప్రారంభంలో స్పెయిన్ ఆధిపత్యం చెలాయించింది. ప్రథమార్ధంలో 20 ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో హాఫ్‌లో న్యూజిలాండ్ దూకుడుగా ఆడింది. కీలక సమయంలో రెండు గోల్స్ చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో సఫలమైంది.

France earned the quarter final berth

Telangana Latest News