Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

జగజ్జేత ఫ్రాన్స్

france

ఫైనల్లో క్రొయేషియా ఓటమి

మాస్కో: సంచలనాలు ఏమీ జరుగలేదు. ఊహించినట్టుగానే ఫ్రాన్స్ ఫిఫా ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. మరోవైపు అసాధారణ ఆటతో ఫైనల్‌కు చేరి ప్రపంచ ఫుట్‌బాల్ పెను ప్రకంపనలు సృష్టిం చిన క్రొయేషియా తుది పోరులో తడబ డింది. తీవ్ర ఒత్తిడికి గురైన క్రొయేషియా ఫైనల్లో ఓటమి పాలైంది. మరోవైపు అసాధారణ ఆటను కనబరిచిన ఫ్రాన్స్ 42 తేడాతో క్రొయేషి యాను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. ఫ్రాన్స్‌కు ఇది రెండో ప్రపంచకప్ ట్రోఫీ. అంతకుముందు 1998లో తొలిసారి ఫ్రాన్స్ ప్రపంచకప్‌ను ముద్దా డింది. మరోసారి ఫైనల్లో ఓటమి పాలైంది. ఆదివారం చారిత్రక లుజ్నికి స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ 42 గోల్స్ తేడాతో క్రొయేషియాను ఓడించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల, సాకర్ ప్రేమికుల మద్దతు సంపాదించిన పసికూన క్రొయే షియా ఫైనల్లో తడబడింది. ప్రారంభంలోనే ఫ్రాన్స్‌కు సెల్ఫ్ గోల్ సమర్పించి పట్టు సడలిం చింది. మరోవైపు అసాధారణ ఆటతో చెలరేగిన ఫ్రాన్స్ తన ఖాతాలో రెండో ప్రపంచకప్‌ను జమ చేసుకుంది. మూడు సార్లు ఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్ రెండింటిలో విశ్వవిజేతగా నిలి చింది. క్రొయేషియాతో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ తెలివిగా పావులు కదుపుతు విజయాన్ని సొంతం చేసుకుంది. 18వ నిమిషంలోనే క్రొయేషియా ఆటగాడు మండు జుకిచ్ చేసిన సెల్ఫ్ గోల్‌తో ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే కొద్ది సేపటికే స్టార్ ఆట గాడు పెరిసిక్ గోల్ చేయడంతో క్రొయేషియా స్కోరును 11తో సమం చేసింది. అయితే ఫ్రాన్స్ స్టార్ గ్రెజి మన్ 38వ నిమిషంలో చేసిన గోల్‌తో ఫ్రాన్స్ మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ప్రథమార్ధంలో స్కోరును సమం చేసేందుకు క్రొయేషియా తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ద్వితీయార్ధంలో ఫ్రాన్స్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 59వ నిమి షంలో పోగ్బా ఫ్రాన్స్‌కు మూడో గోల్ అందించాడు. ఆరు నిమిషాల తర్వాత స్టార్ ఆటగాడు ఎంబపె మరో గోల్ సాధించాడు. దీంతో ఫ్రాన్స్ 3-1 ఆధిక్యంలోకి దూసుకె ళ్లింది. కాగా, క్రొయే షియా ఆటగాడు 69వ నిమిషంలో జట్టుకు రెండో గోల్ సాధించి పెట్టాడు. తర్వాత కూడా క్రొయేషియా ఎటాకింగ్ గేమ్ ఆడినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న ఫ్రాన్స్ 4-2తో గెలిచి ప్రపంచకప్ ఫుట్‌బాల్ ట్రోఫీని సొంతం చేసుకుంది.
సెల్ఫ్ గోల్‌తో…
క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్‌క్రొయేషియాలు ప్రారంభం నుంచే ఎటాకింగ్ గేమ్‌తో అలరించాయి. ఇరు జట్ల ఆటగాళ్లు పాదరసంలా కదులుతూ ముందుకు సాగారు. ఒకరి గోల్ పోస్ట్‌పై మరోకరూ దాడులు చేస్తూ గోల్స్ కోసం ప్రయత్నించాయి. ప్రారంభంలో క్రొయేషియా కాస్త పైచేయి కనబరిచింది. వరుస దాడులతో ఫ్రాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే ఫ్రాన్స్ కూడా పట్టు వదలకుండా పోరాడుతూ లక్షం దిశగా అడుగులు వేసింది. ఇరు జట్లు కూడా సర్వం ఒడ్డడంతో ప్రారంభంలోనే పోరు ఆసక్తికరంగా మారింది. అయితే ఆట 18వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మండు జుకిచ్ సరిదిద్దికోలేని పొరపాటు చేశాడు. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న క్రొయేషియా ప్రయాణాన్ని క్లిష్టంగా మార్చాడు. తనకు దొరికిన బంతిని సెల్ఫ్ గోల్‌గా మలచి ఫ్రాన్స్‌కు తొలి గోల్‌ను అందించాడు. అంతే అప్పటి వరకు తడబడుతూ కనిపించిన ఫ్రాన్స్ ఒక్కసారిగా పుంజుకుంది. అయితే క్రొయేషియా కూడా దూకుడుగా ఆడుతూ స్కోరును సమం చేసేందుకు ప్రయత్నించింది. 28వ నిమిషంలో క్రొయేషియా ప్రయత్నాలు ఫలించాయి. స్టార్ ఆటగాడు పెరిసిక్ అద్భుత గోల్‌తో స్కోరును సమం చేశాడు. తర్వాత కూడా రెండు జట్లు ఆధిక్యం కోసం తీవ్రంగా పోరాడాయి. 38వ నిమిషంలో ఫ్రాన్స్ దిగ్గజ ఆటగాడు గ్రెజిమన్ తన జట్టుకు రెండో గోల్ అందించాడు. దీన్ని కాపాడుకున్న ఫ్రాన్స్ ప్రథమార్ధంలో 21 ఆధిక్యంలో నిలిచింది.
ఫ్రాన్స్ దూకుడు…
రెండో హాఫ్ ప్రారంభం నుంచే ఫ్రాన్స్ దూకుడుగా ఆడింది. వరుస దాడులతో క్రొయేషియాను ఉక్కిరిబిక్కిరి చేసింది. అంతకుముందు అర్జెంటీనా, ఉరుగ్వేలపై కూడా ఇలాగే దూకుడును ప్రదర్శించిన ఫ్రాన్స్ ఫైనల్లో కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించింది. వరుసగా రెండు గోల్స్ చేసి క్రొయేషియాకు కోలుకోలేని దెబ్బ తీసింది. 59వ నిమిషంలో పోగ్బా కళ్లు చెదిరే గోల్ చేశాడు. కొద్ది సేపటికే ఫ్రాన్స్‌కు మరో గోల్ లభించింది. స్టార్ ఆటగాడు, యువ సంచలనం ఎంబపె 65వ నిమిషంలో సాధించిన గోల్‌తో ఫ్రాన్స్ 41 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత క్రొయేషియా రెండో గోల్ చేసినా ఫలితం లేకుండా పోయింది. మండు జుకిచ్ 69వ నిమిషంలో ఈ గోల్ చేశాడు. అయితే అప్పటికే సమయం మించి పోవడంతో క్రొయేషియాకు స్కోరును సమం చేసే అవకాశం లేకుండా పోయింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న ఫ్రాన్స్ ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇదిలావుండగా విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ట్రోఫీని అందజేశారు. రష్యా వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్‌లో 32 జట్లు తలపడ్డాయి. జూన్ 14న ప్రారంభమైన విశ్వకప్ ఆదివారం జరిగిన ఫైనల్‌తో ముగిసింది. టైటిల్ ఫేవరెట్లుగా పరిగణించిన జర్మనీ, బ్రెజిల్, అర్జెంటీనా, స్పెయిన్, పోర్చుగల్, బెల్జియం, ఇంగ్లండ్, ఉరుగ్వే, స్విట్జర్లాండ్ తదితర అగ్రశ్రేణి జట్లు టైటిల్ పోరుకు చేరడంలో విఫలమయ్యాయి. ఇంగ్లండ్, బెల్జియం జట్లు అద్భుత ఆటను కనబరిచినా ఫైనల్‌కు చేరడంలో విఫలమయ్యాయి. మరోవైపు పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఫ్రాన్స్ విశ్వవిజేతగా అవతరించిన ప్రకంపకనలు సృష్టించింది. ఇక, పసికూన క్రొయేషియా ఏకంగా ఫైనల్‌కు చేరుకుని ప్రపంచ ఫుట్‌బాల్ సరికొత్త ఆధ్యాయానికి తెర లేపింది.

ఓడి గెలిచారు…

ff

ప్రపంచకప్ ఫైనల్లో క్రొయే షియా ఓడినా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభి మానుల మనసులను గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కోట్లాది మంది ఫుట్ బాల్ ప్రేమికులు క్రొయేషి యాకు అండగా నిలిచారు. పలు దేశాల్లో లక్షలాది మంది అభిమానులు టివిల్లో మ్యాచ్ లను వీక్షించారు. వీరిలో చాలా మంది క్రొయేషియాకే మద్దతు పలికారు. అంచనాలు లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన పసికూన క్రొయేషియా ఏకంగా ఫైనల్‌కు చేరుకుని ప్రపంచకప్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫైనల్‌కు చేరుకునే క్రమంలో అర్జెంటీనా, నైజీరియా, డెన్మార్క్, రష్యా, ఇంగ్లండ్ వంటి బలమైన జట్లను మట్టి కరిపించింది. కేవలం 40 లక్షల జనాభాతో అతి చిన్న దేశంగా ఉన్న క్రొయే షియా అసాధారణ ఆటతో ఫుట్‌బాల్‌లో పెను సంచలనంగా అవతరించింది. ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో అనుభవలే మితో పరాజయం పాలైనా అభిమానుల మనసుల్లో చిరకాలం గుర్తుండి పోవడం ఖాయం.

Comments

comments