Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

మితిమీరిన ఫ్రాన్స్ ఆటగాళ్ల సంబరాలు!(వీడియో)

France players invade Didier Deschamp's press conference

మాస్కో: ఎలాంటి సంచలనాలకు తావులేకుండా, అందరూ ఊహించినట్టుగానే ఫ్రాన్స్ ఫిఫా ప్రపంచ కప్ ను ఎగరేసుకుపోయింది. ఫైనల్ పోరులో తీవ్ర ఒత్తిడికి గురైన పసికూన క్రొయేషియా తడబడి ఓటమి పాలైంది. మరోవైపు అద్భుతంగా ఆడిన ఫ్రాన్స్ 4-2 తేడాతో క్రొయేషియాను ఓడించి జగజ్జేతగా అవతరించింది. సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత రెండోసారి ఫ్రాన్స్‌ సాకర్ ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. అయితే, సాకర్ ప్రపంచ కప్ ను గెలుచుకున్న ఫ్రాన్స్ ఆటగాళ్ల సంబరం మితిమీరింది. మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జట్టు కోచ్ డిడియర్ డెషాంప్స్ ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా అక్కడికి వచ్చిన జట్టు సభ్యులు ఒకరిపై ఒకరు షాంపైన్ చల్లుకుంటూ, అక్కడ ఏర్పాటు చేసిన టేబుళ్లపై ఎక్కి చొక్కాలు విప్పేసి మరీ చిందులేశారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. ఎంత గెలిచినా మరీ ఇలానా? అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఫ్రాన్స్ ఆటగాళ్ల సంబరాలపై మీరూ ఓ లుక్కేయండి.

Comments

comments