Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఫ్రాన్స్‌లో అధ్యక్షుడు మాక్రాన్ హవా

  •  ఎన్నికల్లో అపార బలం తథ్యం

Macron

పారిస్: ప్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ పార్టీ  పార్లమెంట్‌లో అసాధారణ మెజారిటీకి దగ్గరగా ఉంది. నేషనల్ అసెంబ్లీకి తొలిరౌండు పోలింగ్ సాంప్రదాయ పార్టీలను కంగుతినిపించింది. మాక్రోన్ తన సెంట్రిస్టు విప్లవ పరిథిని విస్తృతం చేసుకొన్నా రని ఫలితాల సరళి తెలుపుతోంది.  557 సీట్ల నేషనల్ అసెంబ్లీలో ఆయనకుచెందిన రిపబ్లిక్ ఎన్ మార్చె (రిపబ్లిక్ అఆన్ ది మువ్ , రెమ్) పార్టీ , దాని మిత్ర పక్షం మోడెమ్ వరుసగా 400, 445 స్థానాలు గెలిచే అవకాశం కనపడుతోంది.  అదే నిజమైతే మాక్రాన్‌కు గత 60 ఏళ్లలో దేశంలో ఎన్నడూ రానంత  పెద్ద మెజారిటీ వ ్ధస్తుంది. ఫ్రాన్స్ తిరిగి గాడిలో పడింది అని ప్రధాన మంత్రి ఎడ్వార్డ్ ఫిలిప్ విజయ గర్వంతో ప్రకటించారు. వచ్చే ఆదివారం రెండవ రౌండు పోలింగ్ జరుగుతుంది.

Comments

comments