Home జాతీయ వార్తలు రాహుల్‌ను తప్పుపట్టిన ఫ్రాన్స్…

రాహుల్‌ను తప్పుపట్టిన ఫ్రాన్స్…

rahiul

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై లోక్‌సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఫ్రాన్స్ తీవ్రంగా తప్పుపట్టింది. యుద్ధవిమానాల కోనుగోలు ఒప్పందంలో అసలు రహస్యం ఏమీ లేదంటూ స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడే తనకు చెప్పినట్టు రాహుల్ సభలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ రహస్య క్లాజ్‌ను తెలియజేయాడానికి నిరాకరిస్తున్నదని రాహుల్ ఆరోపించారు. రాఫెల్ డీల్‌లో జరిగిన అవకతవకల పట్ల మోడీ రక్షణ మంత్రి సీతారామన్ దేశానికి క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాఫెల్ డీల్‌పై రాహుల్ కామెంట్ చేసిన కొన్ని గంటలకే ఫ్రాన్స్ స్పందించింది. రహస్య ఒప్పందం ఏమీలేదన్న అంశంపై రాహుల్ చేసిన కామెంట్స్ ను ఫ్రాన్స్ కొట్టి పారేసింది. 2008లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇరుదేశాలు రాఫెల్ డీల్‌లోని రహస్యాన్ని బయట పెట్టకూడదని ఫ్రాన్స్ విదేశాంగశాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. భద్రతా, నిర్వహణ సామర్థ్యం దృష్ట్యా ఆ అంశాలను వెల్లడించలేమని చెప్పారు. 58 వేల కోట్లు పెట్టి భారత్ 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ డీల్‌లో గోల్‌మాల్ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్నారు. కానీ రాహుల్ చేసిన వ్యాఖ్యలనే స్వయంగా ఫ్రాన్స్  తిరస్కరించడం మరో ట్విస్ట్‌కు దారి తీయడం గమనార్హం. ఫ్రాన్స్ ఆ వ్యాఖ్యలను కొట్టిపారేసినా, తాను చెప్పిందే రైట్ అని రాహుల్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు.