Home తాజా వార్తలు అనిల్‌పై మరో పిడుగు

అనిల్‌పై మరో పిడుగు

Anil Ambani 143.7 మిలియన్ యూరోల పన్ను రద్దు చేసిన ఫ్రాన్స్
ఫ్రాన్స్ పత్రిక ‘లీ మోండే’ సంచలన కథనం

న్యూఢిల్లీ: రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రాఫెల్ ఒప్పందం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీ నెత్తిపై ఫ్రాన్స్ పత్రిక మరో పిడుగు వేసింది. ఆయనకు చెందిన కంపెనీకి 143.7 మిలియన్ యూరోల పన్నును ఫ్రాన్స్ అధికారులు మాఫీ చేసారని ఫ్రెంచ్ జాతీయ పత్రిక ‘లీ మోండే’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఫ్రాన్స్‌లో ఉండే అనిల్ అంబానీకి చెందిన ‘ రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్’ అనే సంస్థకు చెందిన పన్నును ఫ్రాన్స్ రద్దు చేసిందని ఆ పత్రిక తెలిపింది. రాఫెల్ యుద్ధ విమాననాల కొనుగోలు విషయమై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న కొద్ది నెలల తర్వాతే ఇది జరిగిందని తెలిపింది.

2015 ఏప్రిల్‌లో ప్రధాని మోడీ ఫ్రాన్స్ వెళ్లారు.ఆ సమయంలో 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని, అదే ఏడాది అక్టోబర్‌లో అనిల్ కంపెనీకి ఫ్రాన్స్ పన్ను మాఫీ చేసిందని ఆ పత్రిక కథనం పేర్కొంది. ‘లీ మోండే’ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్ అంబానీ కంపెనీ 20072010 సంవత్సరాల మధ్య 60 మిలియన్ యూరోల పన్ను చెల్లించాల్సి ఉంది. ఫ్రాన్స్ పన్ను అధికారులు ఈ విషయమై రిలయన్స్ అట్లాంటిక్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ సంస్థ 7.6 మిలియన్ యూరోలు మాత్రమే చెల్లించగలమని అభ్యర్థించింది. అయితే అధికారులు దీనికి అంగీకరించలేదు. మొత్తం పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.

ఆ తర్వాత మరోసారి 201012 మధ్య కాలంలో ఫ్రెంచ్ అధికారులు కంపెనీపై విచారణ జరిపారు. అప్పుడు మరో 91 మిలియన్ యూరోలు చెల్లించాల్సి ఉందని లెక్క తేలింది. అప్పటికే చెల్లించాల్సిన పన్ను 151 మిలియన్ యూరోలకు చేరింది. రిలయన్స్ అట్లాంటిక్ 2015లో ముందు చెప్పినట్లుగా 7.6 మిలియన్ యూరోలను పన్నుగా చెల్లించింది. అదే ఏడాది అక్టోబర్‌లో మిగిలిన 143.7 మిలియన్ యూరోల పన్నును ఫ్రాన్స్ రద్దు చేసినట్లు ఆ పత్రిక తెలిపింది. దీనిపై జులైన్ బోయిసో అనే పాత్రికేయుడు కూడా వరస ట్వీట్లు పెట్టారు. ‘అనిల్ అంబానీ సంస్థ చెల్లించాల్సిన 151 మిలియన్ యూరోల పన్నుకు బదులు 7.6 మిలియన్ యూరోలు చెల్లించడానికి ఒప్పందం కుదిరింది. ఇదంతా ప్రధాని మోడీ రాఫెల్ ఒప్పందం గురించి ప్రకటించిన తర్వాత జరగడం గమనార్హం’ అని ఆయన ట్వీట్ చేశారు.

‘రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్, భారత్‌లు 2015 ఏప్రిల్, అక్టోబర్ మధ్య చర్చల్లో మునిగి ఉన్న సమయంలో అనిల్ అంబానీకి 143.7 మిలియన్ యూరోల పన్ను చెల్లింపునుంచి విముక్తి లభించింది’ అని మరో ట్వీట్‌లో అన్నారు. అయితే అనిల్ అంబాని సంస్థకు పన్ను మాఫీలో ఎలాంటి రాజకీయ జోక్యంలేదని ఫ్రాన్స్ ధౌత్యకార్యాలయం స్పష్టం చేసింది.

20082012 మధ్య కాలానికి సంబంధించి ఫ్రెంచ్ టాక్స్ అధికారులకు, రిలయన్స్ ఫ్లాగ్ సంస్థకు మధ్య ఒక అంతర్జాతీయ పరిష్కారం కుదిరింది. ఈ టాక్స్ పాలనా యంత్రాంగం అనుసరిస్తూ వస్తున్న రెగ్యులేటరీ విధివిధానాలకు పూర్తిగా కట్టుబడి ఈ పరిష్కారం నిర్వహించబడింది. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు’ అని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

అంతా చట్ట ప్రకారమే జరిగింది
ఫ్రెంచ్ పత్రిక కథనాన్ని కొట్టిపారేసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్

ముంబయి: కాగా ఫ్రెంచ్ పత్రిక క థనంపై రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్పందించింది. ఫ్రెంచ్ అధికారుల ప న్ను డిమాండ్ సమర్థనీయం కాద ని, చట్టవిరుద్ధమని పేర్కొంది. ఇది 2008 నాటిఅంటే పదేళ్ల కిందటి కేసని తెలిపింది. దీనిపై ఫ్రెంచ్ అధికారులతో ఒక పరిష్కారాన్ని ఆ దేశ చట్టాలకు అనుగుణంగాకుదుర్చుకున్న ట్లు తెలిపింది. ఫ్రాన్స్ చట్టాల ప్రకారం అన్ని కంపెనీలకు ఇలాం టి వెసులుబాటు ఉందని తెలిపింది.

దీనివల్ల ఎలాంటి లబ్ధీ చేకూరలేదని, పక్షపాతంతో వ్యవహరించలేదని స్పష్టం చేసింది.200812 మధ్య కాలం లో రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్‌కు ఆపరేటింగ్ న ష్టాలు 2.7 మిలియన్ యూరోలని, దీనికి ఫ్రెంచ్ పన్ను అధికారులు అత్యధిక పన్ను విధించారని, దీనిపై పరస్పర పరిష్కార ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తెలిపింది.

కాగా 201012 మధ్య కాలంలో రిలయన్స్ ఫ్లాగ్ అపరేటింగ్ నష్టా లు రూ.20 కోట్లు ఉండగా దీనికి పన్ను అధికారులు రూ.1100 కోట్ల పన్ను విధించారని రిలయన్స్ కమ్యూనికేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఫ్రాన్స్ టాక్స్ సెటిల్‌మెంట్ నిబంధనల ప్రకారం తుది పరిష్కారంగా రూ.56 కోట్లు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ అధికారి స్పష్టం చేశారు.

France Waived 144 Mn Euros Tax Dues Of Anil Ambani