Home తాజా వార్తలు బ్యాంక్‌లో ఘరానా మోసం

బ్యాంక్‌లో ఘరానా మోసం

Loss of domestic banks in three years with financial fraud

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కర్నాటక బ్యాంక్‌లో గురువారం ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. 30 మందిని రైతులుగా చూపి రూ.15 కోట్లకు ఓ వ్యక్తి కుచ్చుటోపి వేశారు. యు కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లిలో ధాన్యం గిడ్డంగి పేరుతో రుణం తీసుకున్నాడు. రూ.15 కోట్ల రుణం తీర్చాలంటూ కర్నాటక బ్యాంక్ నుంచి రైతులకు నోటీసులు అందాయి. కుంభకోణంలో కర్నాటక బ్యాంక్ అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.