Home తాజా వార్తలు ఎంసెట్, నిట్ పరీక్షలకు ఉచిత తరగతులు : కడియం

ఎంసెట్, నిట్ పరీక్షలకు ఉచిత తరగతులు : కడియం

kadiyam-srihari

వరంగల్ అర్బన్: జిల్లాలోని హసన్ పర్తి రెసిడెన్షియల్ కాలేజీలో ఎంసెట్, నీట్ పరీక్షల కేంద్రాలను విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ… ఎంసెట్, నీట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని గురుకుల పాఠశాలు, మోడల్ స్కూల్ లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నమని  కడియం పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మంది విద్యార్థులకు 26 సెంటర్లలో తరగతులు నడుస్తున్నయని ఆయన తెలిపారు. ప్రతి సెంటర్ కు ఒక ప్రిన్సిపాల్ ను నియమించామన్నారు. దీంతో మంచి ఫలితాలు రాబట్టొచ్చని చెప్పారు. ఉచిత తరగతును బోధించే సెంటర్లకు రూ.15 లక్షల చొప్పున కేటాయిస్తామని వెల్లడించారు. పేద విద్యార్థులకు కోసం ప్రభుత్వ ఖర్చు విషయంలో వెనకంజ వేసేదేలేదని ఆయన స్పష్టం చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించాలన్నదే కెసిఆర్ మఖ్య ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు.