Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

నిర్మల్ పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

Free coaching for constable recruitment

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్‌ః తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 18 వేల కానిస్టేబుల్ నియామకాల కోసం నిర్మల్ పోలీస్ ఆధ్వర్యంలో ఉద్యోగుల కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు పేర్కొన్నారు.బుధవారం పట్టణంలోని వైఎస్‌ఆర్ కళ్యాణ మండపంలో ఫ్రీ పోలీస్ రిక్యూర్‌మెంట్ అవర్‌నెస్ క్యాంపు నిర్వహించారు.జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు ఆదేశాల మేరకు ఉచిత కానిస్టేబుల్ శిక్షణ గురించి పేర నమోదు చేసుకొన్న యువతి,యువకులు 150 మంది అభ్యర్థులు హాజరైయ్యారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి వారిలో ఉత్తీర్ణులైన వారికి త్వరలోనే శారీరక దారుడ్య పరీక్షలు నిర్వహించి ఉచిత శ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని ప్రతీ ఒక యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ దక్షణామూర్తి,నిర్మల్ డిఎస్‌పి మనోహార్‌రెడ్డి,సిఐలు జాన్‌దివాకర్,రమేష్‌బాబు,ఎస్‌ఐలు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

comments