Home కెరీర్ 13న ఉచిత జాబ్ మేళా

13న ఉచిత జాబ్ మేళా

JOB-MELA-1

హైదరాబాద్ : ఈనెల 13న నిరుద్యోగ యువత కోసం ఐటి, సైన్స్ అండ్ కామర్స్ ఉచిత జాబ్ మేళా నిర్వహించనుంది. టెరాబైట్ ఐటి సొల్యూషన్స్, బిజినెస్ టు పోర్టల్ ట్రేడ్ హైదరాబాద్ డాట్‌కంల ఆధ్వర్యంలో ఈ జాబ్‌మేళా జరగనుంది. కొత్తపేటలోని టెరాబైట్ ఐటి క్యాంపస్‌లో ఈ మేళా నిర్వహించనున్నారు. ఇంటర్, డిగ్రీ , ఎంబిఎ, బిటెక్, డిప్లొమా, ఐటిఐ, బి-ఫార్మసీ, డి-ఫార్మసీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇందులో ఫ్లిప్ కార్ట్, హెరిటేజ్, అడెకో, అవ్వాస్, క్లిక్స్, యురేకా ఫోర్బ్, అఫోలో ఫార్మసీ తదితర కంపెనీలు పాల్గొని ఇంటర్వూల ద్వారా నేరుగా ఉద్యోగాల్లో చేర్చుకుంటారు. జాబ్ మేళాకు హాజరయ్యే వారు తమ రెజ్యుమ్‌లతో రావాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం 7288888260, 7288888261 నంబర్లలో సంప్రదించవచ్చు.