Search
Saturday 17 November 2018
  • :
  • :

దోపిడి రహిత సమాజమే లక్ష్యం

CPI

వరంగల్: దేశంలో దోపిడి రహిత సమాజమే లక్షంగా భారత కమ్యూనిస్టుపార్టీ (సిపిఐ) పనిచేస్తుందని ఆపార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి,మాజీ ఎంఎల్‌ఎ పోతరాజు సారయ్య అన్నారు. సిపిఐ 91 ఆవిర్భావ వార్షికోత్సవాలను పురష్కరించుకొని బుధవారం హన్మకొండలో సిపిఐ వరంగల్ అర్బన్ జిల్లా సమితి ఆధ్వర్యంలో వేయి స్తంభాల దేవాలయం నుంచి హన్మకొండ చౌరస్తా మీదుగా అంబేద్కర్ జంక్షన్ వరకు 91 మీటర్ల ఎర్ర జెండాతో సిపిఐ కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించారు.

ఈసందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పంచారు. ఈ సందర్భంగా సారయ్య మాట్లాడుతూ దేశంలో బ్రిటీష్ సామ్రాజ్యవా దులకు వ్యతిరేకంగా పోరాడింది సిపిఐయేనని అన్నారు. దేశంలో అంతరాలు లేని సమసమాజ స్థాపన కోసం రాజీలేని పోరాటాలను చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్య పరుస్తూ నిరంతరం ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని తేలేక కరెన్సీ రద్దుచేయడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నోట్లు రద్దు చేసి 50 రోజులు దాటినా నేటికి క్యూలైన్‌లలో నిలబడ్డా డబ్బులు దొరకని దుస్థితి నెలకొన్నదన్నారు.

సిపిఐ అర్బన్ జిల్లా కార్యదర్శి సిరబోయిన కరుణాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రసాధనలో సిపిఐ కీలకంగా పనిచేసిందన్నారు. నాడు నిజాం నిరంకుశ, భూస్వామ్య పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి సాయుధ రైతాంగ పోరాటాన్ని చేసిన ఘనత సిపిఐదేనన్నారు. 4వేల గ్రామాలను విముక్తి చేయడంతోపాటు 10లక్షల ఎకరాల భూమిని భూమిలేని నిరుపేదలకు పంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా సహాయ కార్యదర్శులు కర్రె బిక్షపతి, పనాస ప్రసాద్, నగర కార్యదర్శి ఎస్‌కె బాష్‌మియా, నగర సహాయ కార్యదర్శులు ఏశబోయిన శ్రీనివాస్, బుస్స రవీందర్, నాయకులు ఆదరి శ్రీనివాస్, మండల సదాలక్ష్మి, నల్లా శ్రావణి, కొత్తపల్లి చిరంజీవి, ఎస్. అశోక్ స్టాలిన్, కంచెర్ల సదానందం, వి. సదానందం, గిన్నారపు రోహిత్, గడ్డం నాగార్జున, మంచాల స్వామి చరణ్, గన్నారపు రమేష్, ఆర్, లలిత, కె,దేవి, కె.సునిత, ఎం. విజయ్, కార్యాలయ కార్యదర్శి గుండె బద్రి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments