Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఉచిత శిక్షణ తరగతులు

FREE-TRININGబంజారాహిల్స్ : కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ద్వారా ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. నగరానికి చెందిన ట్రైలాజిగ్ సాఫ్ట్ సొల్యూషన్స్ సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. 18నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగిన యువతీయువకులు ఇంజనీరింగ్,డిగ్రీ తదితర కోర్సులు పూర్తిచేసి ఉంటే వారికి జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, వెబ్ డెవలపర్,అర్కిటెక్చర్, సివిల్ 2డి డ్రాఫ్టింగ్, ఆటోకాడ్ అంశాల్లో ఉచిత వసతి తో పాటు శిక్షణను అందిస్తామన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు నాస్కామ్ సంస్థ సర్టిఫికెట్ అందజేస్తుందని సంస్థ ఎండీ రవికుమార్ సిరిమల్ల తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 87120 40303, 8712010404 నెంబర్లలో సంప్రదించి వివరాలను తెలుసుకోవాలని కోరారు.

Comments

comments