Home తాజా వార్తలు బిటెక్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

బిటెక్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

Free Training for BTech Candidates

హైదరాబాద్ : బిటెక్ 2016, 17,18లలో ఉత్తీర్ణులైన వారికి నామమాత్రపు రుసుంతో ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్టు టెక్ మహీంద్ర ఫౌండేషన్ ప్రోగ్రాం సీనియర్ ఆఫీసర్ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. వెబ్ డిజైనింగ్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్ వంటి సాఫ్ట్‌వేర్ ప్యాకేజీ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని ఆయన చెప్పారు. ఆసక్తి గల అర్హులు ఈనెల5వ తేదీలోగా అమీర్‌పేట్ ఆదిత్య ఎన్‌క్లేవ్‌లోని తమ శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు 767591 4735, 515134735 నంబర్లలో సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Free Training for BTech Candidates