Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ

Free training for government jobs in HB Colony
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించేందుకు నిరుద్యోగ యువత కృషి పట్టుదలతో ఉంటే ఉచిత శిక్షణ కల్పించి వారికి చేయుతనందిస్తామని పిసిసి కార్యదర్శి, చారిటబులు ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్, విఆర్‌ఒ, గ్రూప్-4 ప్రభుత్వ ఉద్యోగాల కోసం బండారి లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో హెచ్‌బి కాలనీ కైలసగిరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను బుధవారం ఉప్పల్ మాజీ ఎంఎల్ఎ బండారి రాజీరెడ్డి, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతిసాయిజేన్ శేఖర్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతులలో ప్రముఖ మోటివేషన్ స్పీకర్ బిఆర్ షఫీ తన ప్రసంగంతో అభ్యర్ధులను ఉత్తేజ పరిచారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ పొందలంటే వేలలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఎంతో మంది నిరుపేదలు శిక్షణ తీసుకోలేక ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారని వారి కోసం ప్రత్యేకంగా ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్, విఆర్‌ఒ, గ్రూప్-4 ఉద్యోగాల కోసం తొమ్మిది వందల మంది అభ్యర్ధులు శిక్షణ తరగతులకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. పేరున్నఇనిస్టిట్యూట్లలో పని చేస్తున్న మంచి నైపుణ్యం కలిగిన శిక్షకులతో శిక్షణ కల్పిస్తున్నామని అభ్యర్ధులు పట్టుదలతో చదివి ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులకు అండగా నిలవాలని ఆయన సూచించారు. అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

comments