Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

గిరిజనులకు ఉచిత శిక్షణ

                             Free-Training

హైదరాబాద్ : జిఆర్‌ఇ, జిమ్యాట్, టొఫెల్, ఐఇఎల్‌టిఎస్ లలో గిరిజనులకు ఎంపిక చేసిన విద్యా సంస్థల్లో ఉచిత శిక్షణ ఇవ్వ నున్నట్లు గిరిజన సంక్షేమ కమిషనర్ ఆర్.లక్ష్మణ్ తెలిపారు. సంవత్సరానికి రూ.2 లక్షల లోపు కుటుంబ ఆదాయం కలిగిన గిరిజన కుటుంబాలకు చెందిన ఎస్‌టి విద్యా ర్థులు ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. హైదరాబాద్ రంగారెడ్డి, వరంగల్, మేడ్చల్ (మల్కాజ్‌గిరి) జిల్లాల్లో కోచింగ్ సెంటర్లను ఎంపిక చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ పథకం గురించి మరిన్ని వివరాలకు, ధరఖాస్తుల కోసం www.telanganaepass. cgg.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు. ఒక విద్యార్థికి 100 గంటల జిఆర్ ఇ శిక్షణకు రూ.9000, జిమ్యాట్ శిక్షణకు రూ.23,000, 60 గంటల టొఫెల్ శిక్షణకు రూ.5,000, ఐఇఎల్‌టిఎస్‌కు రూ.4,200 రేటును నిర్ణయించారు. మరిన్ని వివరాలకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిని సంప్రదించవచ్చు.

Comments

comments