Search
Monday 24 September 2018
  • :
  • :

యువతకు ఉచిత శిక్షణ తరగతులు

PRADANA-MANTRI-YOJANA

హైదరాబాద్: నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ కేటగిరిల్లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శేరిలింగంపల్లిలోని ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో శిక్షణతోపాటు వారికి ఉపాధిని కల్పించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. మ్యూచ్‌వల్ ఫండ్ ఎజెంట్, డొమెస్టిక్ ఐటి హెల్ప్‌డెస్క్ అటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్ టెక్నిషీయన్, హోటల్ మేనేజ్‌మెంట్, ఆఫ్టికల్ ఫైబర్ టెక్నీషియన్ కోర్సులకు ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 18-35 లోపు వయసు ఉండి 5వ తరగతి నుంచి పిజి వరకు చదివిన అభ్యర్థులు తమ సరిఫికెట్లు, ఆధార్, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ జిరాక్స్‌తోపాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో లింగంపల్లి రైల్వేస్టేషన్‌లోని ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో దరఖాస్తులు అందించవచ్చని కేంద్రం నిర్వాహకులు పేర్కొన్నారు.. ఇతర వివరాలకు సెల్: 7731870274, 70329 13133లలో సంప్రదించాలని కోరారు.

Comments

comments