Home తాజా వార్తలు ఉచిత శిక్షణ తరగతులు

ఉచిత శిక్షణ తరగతులు

Free Employment Training Classes in Byrider

మేడ్చల్ : ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకంలో మేడ్చల్, అల్వాల్‌లోని ప్రభుత్వ ఐటిఐలలో ఉచిత శిక్షణ, తరగతులు నిర్వహించనున్నారు. ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్హతలు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి నిరుద్యోగులుగా ఉన్న అభ్యర్థులకు అల్వాల్ ఐటిఐలో అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ కోర్సు, మేడ్చల్ ఐటిఐలో ఫీల్డ్ టెక్నీషియన్ హోమ్ అప్లయోన్స్, గ్యాస్ టంగ్‌స్టన్, ఆర్క్ వెల్డింగ్ కోర్సులలో శిక్షణ ఉంటుందని, ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ఈ నెల 17న అల్వాల్ ఐటిఐలో జరుగనున్న కౌశల్ మేళాకు హాజరు కావాలని తెలిపారు. అభ్యర్థులు తమతమ సర్టిఫికెట్లతో పాటు ఆధార్ కార్డును తీసుకురావాలని కోరారు.