Search
Wednesday 14 November 2018
  • :
  • :

డెంటల్ అసిస్టెంట్స్‌ కోర్సులో ఉచిత శిక్షణ

Free Training in Dental Assistants Course

హైదరాబాద్ : రజక నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం డెంటల్ అసిస్టెంట్స్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు రజక సంఘాల రాష్ట్ర కన్వీనర్ కొండూరు సత్యనారాయణ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే రజక కుల యువత టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివి 18-35 ఏళ్ల వయస్సు కలిగిన ఉన్న వారు ఈ శిక్షణకు అర్హులని ఆయన పేర్కొన్నారు. డెంటల్ కోర్సులతో పాటు కంప్యూటర్‌పై అవగాహన కలిపిస్తామని ఆయన వెల్లడించారు. శిక్షణ ఇచ్చే మూడు నెలల పాటు బస్‌పాస్ సౌకర్యం, మధ్యాహ్న భోజన వసతి కలిపిస్తామని ఆయన చెప్పారు. శిక్షణ పూర్తయిన తరువాత ఆయా సంస్థల్లో ఉపాధి కోసం ఉద్యోగ అవకాశాలు కలిపిస్తామన్నారు. ఆసక్తిగల వారు 040-233 91274 నంబర్‌లో సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

comments