Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఉచిత శిక్షణ

Hotel-Management

హైదరాబాద్ : మెకెన్సీ ఫౌండేషన్, సిటీ బ్యాంకు ఆధ్వర్యంలో ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సంస్థ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో రెండు మాసాల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటర్ అర్హత కలిగి 18 నుంచి 28 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారు ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు అర్హులు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనం సదుపాయాలు కల్పిస్తారు. శిక్షణ అనంతరం ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు జీతం ఇస్తారు. విదేశాల్లో పని చేసే అవకాశం కూడా ఉంది. పూర్తి వివరాలకు 9000097781, 8897732197 నంబర్లలో సంప్రదించాలని సంస్థ ప్రతినిధి పివిఆర్ కృష్ణన్ తెలిపారు.

Free training in hotel management

Comments

comments