Home తాజా వార్తలు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

నర్సింగ్ అసిస్టెంట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

FEVER

హైదరాబాద్ : నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, తిలక్‌నగర్ రోడ్డులో ఉన్న బెత్లామ్ కాలేజీలలో నర్సింగ్ అసిస్టెంట్ కోర్సుల్లో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ మ్యాన్సీ తెలిపారు. టెన్త్ పాస్, ఫెయిల్ అయిన వారు ఈ శిక్షణ పొందేందుకు అర్హులు. 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల లోపు ఉండాలని మ్యాన్సీ చెప్పారు. శిక్షణ ముగిసిన అనంతరం ప్లేస్‌మెంట్ కూడా ఇప్పిస్తామని మ్యాన్సీ పేర్కొన్నారు. నెలకు తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల వరకు జీతం ఉంటుందని వెల్లడించారు. ఈ కోర్సుతో పాటు కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిషులో కూడా ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. పూర్తి వివరాలకు 9908098903, 9515485280 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

 Free Training in Nursing Assistant Courses