Home తాజా వార్తలు ఎక్స్‌రే అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ

ఎక్స్‌రే అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ

Free Training in X-Ray Assistant Course

హైదరాబాద్ : హైదరాబాద్ హెల్త్ స్కిల్స్ అకాడమీ ద్వారా ఎక్స్‌రే అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటర్ పాసై, 18-35 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారు ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు అర్హులు. నాలుగు మాసాల పాటు ఈ శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయిన అనంతరం కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.12 వేల నుంచి రూ.15 వేల జీతంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ స్కిల్స్‌పై కూడా శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో బుక్స్, యూనిఫామ్‌ను కూడా ఉచితంగా ఇస్తారు. ఇతర వివరాలకు 9908098903, 9515548358 నంబర్లలో సంప్రదించాలి.

Free Training in X-Ray Assistant Course